Monday, January 20, 2025

శ్రీరాంసాగర్ జలాశయంలో పడి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ముప్కాల్ : నిజామాబాద్ జిల్లా, ముప్కాల్‌లో శివరాత్రి పండగ పూట విషా దం చోటుచేసుకుంది. మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రాజెక్టులో మునిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…జక్రాన్‌పల్లి మండలం, గన్య తండాకు చెందిన ఆరుగురు యువకులు కారులో వచ్చి, ముగ్గురు యువకులు స్నానం ఆచరించి పక్కన ఉండగా మరో ముగ్గు రు మరొకసారి స్నానం చేస్తామని కాలువ ముందర ప్రాజెక్టులో దూకారు. అయితే, వీరు అందులో పడి గల్లంతయ్యారు. విషయం తెలుసుకొన్న అధికారులు ఎస్‌ఐ గజ ఈతగాళ్ల కోసం చరవాణి ద్వారా ఫోన్ చేశారు. అనుకున్నంత మంది ఈతగాళ్లు రాకపోవడంతో బాల్కొండ మండలానికి చెందిన ఎస్‌ఐ గోపి ధై ర్యంతో ఒక అడుగు ముందుకువేసి నీటిలో దూకి గాలింపు చర్యలు చేపట్టి, గల్లంతయిన యువకులను బయటకు తీశారు. మృతులను సాయినాథ్, లోకేష్, మున్నాగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్మూర్ ఎసిపి బస్వారెడ్డి బృందం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News