మెదక్ జిల్లా రంగాయపల్లిలో విషాదం
మన తెలంగాణ/మనోహరాబాద్: బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి ప్రమా దవశాత్తు ఇద్దరు మహిళలు, ఒక యువతి, ఒక బాలుడు చెరువులో పడి మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని రంగాయపల్లి గ్రామంలో సో మవారం చోటుచేసుకుంది. ఆదివారం గ్రా మంలో ఉన్న ఎస్సీలంతా గ్రామదేవతలకు బోనాల పండగ నిర్వహించారు. గ్రామానికి చెందిన చంద్రయ్య కుటుంబం కూడా బోనా ల పండగ నిర్వహించగా ములుగు మండలం అంబర్‌పేట గ్రామానికి చెందిన సమీప బంధువులు బోనాల జాతరకు ఇంటికి వ చ్చారు. సోమవారం చంద్రయ్య కూతురు లావణ్య (19), వీరి బంధువులైన ల క్ష్మీ(25), బాలమణి (30), కుమారుడు చ రణ్ (10)లు బట్టలు ఉతకడానికి చెరువు దగ్గరకు వెళ్లారు.
మొదట చరణ్ ప్రమాదవ శాత్తు కాలుజారి చెరువులో మునిగిపోవ డంతో చరణ్‌ను కాపాడటానికి తల్లి బాల మణి నీటిలోకి దిగి మునిగిపోయింది. ఇది గమనించిన లక్ష్మి, లావణ్యలు ఒకరి వెనక ఒకరు చెరువులోకి దిగడంతో ఇద్దరు మహిళ లు కూడా నీట మునిగి మృతి చెందారు. ఈ దుర్ఘటన కుటుంబ సభ్యులకు గ్రామస్థులకు తెలియడంతో హుటహూటిన చెరువు వద్దకు వెళ్లి నీట మునిగిన లక్ష్మీ, బాలమణి, లావణ్యల మృతదేహాలను వెలికితీశారు. బాలుడు చరణ్ మృతదేహం కోసం గజఈతగాళ్లు గాలి స్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తూప్రాన్ డిఎస్పీ, సీఐ శ్రీధర్, స్థా నిక ఎస్సై కరుణాకర్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.