Saturday, December 21, 2024

ఈత సరదాకు ముగ్గురు బలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మాక్లూరు : ఈత కోసం చెరువులోకి దిగిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడిన ఘటన నిజామాబాద్ జిల్లా, మాక్లూర్ మండలం, ఒడ్యాట్‌పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందినతిరుపతి (16), మహేష్ (15), నవీన్ (15) అనే ముగ్గురు విద్యార్థులు ఈత కోసం గ్రామ శివారులోని చెరువుకు వెళ్లారు.

ముగ్గురు ఒకేసారి చెరువులో దిగారు. చాలాసేపటికి వరకు వారు బ యటకు రాకపోవడంతో అక్కడే ఉన్న మరో వ్యక్తి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చెరువు వద్దకు వచ్చి తమ పిల్లల కోసం గాలించారు. చివరకు తమ పిల్లల దుస్తులు, చెప్పులు చెరువు గట్టుపై ఉండడం చూసి చెరువులో ఈతకు వె ళ్ల్లి గల్లంతైనట్టు నిర్ధారించుకున్నారు. గ్రామానికి చెందిన గజ ఈతగాళ్లు రంగంలోకి దిం చారు. గల్లంతైన వారి కోసం వారు చెరువు లో గాలించారు. మొదట తిరుపతి, మహేష్ మృతదేహాలు లభ్యం కాగా ఆ తర్వాత నవీన్ మృతదేహం దొరికింది.

ఈ ప్రమాదంలో మృతి చెందిన తిరుపతి, మహేష్ తమ తమ కుటుంబంలో ఒక్కరే మగ సంతానం కావడం విశేషం. తిరుపతి అనే విద్యార్థి ఇంట్లో ఈనెల 25 న అతని అక్క పెళ్లి జరగాల్సి ఉంది. ఒకేసారి ముగ్గురు విద్యార్థులు నీట మునిగి చనిపోవడంతో బాధిత కుటుంబ సభ్యుల రోదనలతో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన ముగ్గురూ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులుగా ఉంటూ గ్రామంలో సందడి చేసేవాళ్లని, అ లాంటిది ఒకేసారి మృత్యు ఒడిలోకి చేరడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News