Monday, January 20, 2025

ఎంఎంటిఎస్ రైలు ఢీకొని ముగ్గురి మృతి

- Advertisement -
- Advertisement -

Three died in MMTS train collision

మనతెలంగాణ, హైదరాబాద్ : రైలు పట్టాలు దాడుతుండగా ఎంఎంటిఎస్ రైలు ఢీకొట్టడంతో ముగ్గురు కూలీలు మృతిచెందిన సంఘటన హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…వనపర్తి జిల్లాకు చెందిన రాజప్ప(50), శ్రీను(35),కృష్ణ(50) ముగ్గురు కూలీ పనిచేస్తున్నారు. బతుకు దెరువు కోసం ముగ్గురు కూలీ పనిచేస్తూ సంకల్ప్ అపార్ట్‌మెంట్ సమీపంలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఉదయం 8 గంటలకు హైటెక్ సిటీ, హఫీజ్‌పేట మధ్యలో మూలమలుపు వద్ద రైలు పట్టాలు దాటుతుండగా ఎంఎంటిఎస్ రైలు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల వద్ద మద్యం బాటిల్ లభ్యమైనట్లు తెలిసింది. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News