- Advertisement -
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారును లారీ ఢీకొన్న ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా.. స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో కారు పల్టీ కొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని దగ్గర్లోని వరంగల్ ఎంజిఎంకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకొని ట్రాఫిక్‌ని క్లియర్ చేశారు.
- Advertisement -