Monday, December 23, 2024

మద్యం మత్తులో స్విగ్గీ బాయ్‌పై దాడి

- Advertisement -
- Advertisement -

Three Drunk Men Attack on Swiggy Delivery Boy

ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఇద్దరు యువకులు
పోలీస్ స్టేషన్‌లో అప్పగించిన బాధితులు

హైదరాబాద్: మద్యం మత్తులో ముగ్గురు యువకులు స్విగ్గీ డెలివరీ బాయ్‌పై దాడి చేసిన సంఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్ చౌరస్తాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ముగ్గురు యువకులు దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు మరో డెలివరీ బాయ్ వెళ్లడంతో అతడిపైనా దాడి చేశారు. ఇద్దరిపై దాడి చేసిన యువకులు అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నిస్తుండగా వారిని మిగతా స్విగ్గీ బాయ్స్ పట్టుకుని చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన డెలివరీ బాయ్ కిరణ్‌ను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన యువకుల్లో ఇద్దరు ఇటీవలే ఆస్ట్రేలియా నుంచి వచ్చినట్లు తెలిసింది. దాడి సమయంలో అక్కడే కారులో ఉన్న యువతి వీడియో తీయడంతో విషయం బయటికి వచ్చింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చైతన్యపురి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News