నేపాల్‌ని మూడు భూకంపాలు శనివారం మధాహ్నం తాకాయి. టిబెట్ సరిహద్దులోని నేపాల్ తూర్పు ప్రాంతాన్ని ఓ తీవ్ర భూకంపం తాకింది. ఆ తరువాత పశ్చిమ నేపాల్ ప్రాంతాన్ని రెండు తీవ్రత తక్కువ ఉన్న భూకంపాలు తాకాయి అని అధికారులు తెలిపారు. కాగా ఈ మూడు భూకంపాల వల్ల ఎలాంటి ప్రాణ హానీ సంభవించలేదని కూడా వారు స్పష్టం చేశారు. మధ్యాహ్నం 2.35కు 5.9 తీవ్రత భూకంపం రిక్టర్‌స్కేలుపై రికార్డు అయింది. కాగా భూకంప కేంద్రం టిబెట్‌లోని డింగే కౌంటీలో నమోదయింది. తూర్పు నేపాల్‌లోని తాప్లెజంగ్ జిల్లా ఉత్తరాన 140 కిమీ. దూరంలో ఈ భూకంప కేంద్రం నమోదయిందని జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం(ఎన్‌ఈఎంఆర్‌సి) పేర్కొంది. డింగే కౌంటీని చైనా వాళ్లు డింగ్రీ కౌంటీ అని పిలుస్తుంటారు. నేపాల్ అత్యంత చురుకైన టెక్టోనిక్ జోన్లలో ఒకటి(భూకంప మండలాలు IV, V లో ఉంది). ఇది భూకంపాల హానీ కలిగిస్తుంటుంది. ఏ సంవత్సరంలోనైనా అనేక భూకంపాలకు ఇక్కడ ఆస్కారం ఉంటుంది.
నేపాల్‌ను తాకిన మూడు భూకంపాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -