Friday, February 21, 2025

విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

బోధన్ మండలం పెగడపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురై గురువారం ఉదయం మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గంగారం (45) బాలామణి (40) కిషన్ (22) అనే ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు అడవి పందులను పట్టడానికి పంట పొలం దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ క్షేత్రంలోని బోరు బావి వద్ద విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా బోధన్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News