Monday, January 20, 2025

ఇంటి గోడ కూలి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

నాగారం : ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. నాగారం మండల కేంద్రంలో శీలం రాములు (85), తన భార్య రాములమ్మ (75), కొడుకు శ్రీనివాస్(38) తో కలిసి ఉంటున్నాడు. కుటుంబానికి ఆసరాగా ఉండటానికి శ్రీనివాస్ హైదరాబాద్‌కు పని నిమిత్తం వెళ్లాడు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులను చూసేందుకు ఇంటికి వచ్చాడు. బుధవారం రాత్రి భారీ వర్షంతోపాటు ఈదురుగాలులు వీచాయి. దీంతో ఇంటి గోడలు వర్షానికి బాగా నాని నిద్రిస్తున్న ముగ్గురిపై పడ్డాయి. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.

అయితే ఈ విషయం ఎవరూ గమనించలేదు. అయితే గురువారం ఉదయం కరెంట్ బిల్లు ఇచ్చేందుకు విద్యుత్ సిబ్బంది రాములు ఇంటికి రావటంతో అక్కడ ఇంటి గోడలు కూలి ఉండటం చూసి వెంటనే స్థానికులకు సమాచారం అందించాడు. వెంటనే స్థానికులు మట్టిపెళ్లలను తొలగించడంతో అప్పటికే రాములు, రాములమ్మ, శ్రీనివాస్ మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ శిధిలాల పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఎస్సై ముత్తయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News