Wednesday, January 8, 2025

ఢిల్లీలో ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ నెబ్ సరాయి ప్రాంతంలో బుధవారం మధ్య వయస్కులైన దంపతులను. వారి కుమార్తెను వారి ఇంటిలో కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలియజేశారు. మృతులను రాజేష్ కుమార్ (51), అతని భార్య కోమల్ (46), వారి కుమార్తె కవిత (23)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం, ఆ దంపతుల కుమారుడు అర్జున్ ఉదయం సుమారు 5.30 గంటలకు మార్నింగ్ వాక్ నుంచి తిరిగివచ్చినప్పుడు వారి మృతదేహాలను చూసినట్లు, అతను పొరుగువారిని అప్రమత్తం చేయగా, వారు పోలీసులను పిలిపించినట్లు అధికారి ఒకరు చెప్పారు.

‘క్రైమ్ బృందాన్ని, ఫోరెన్సిక్ బృందాలను పిలిపించారు. ప్రాథమికంగా ఇంటిలో విధ్వంసం గానీ, ఏదైనా వస్తువు అపహరణ గానీ జరగలేదు’ అని అధికారి తెలిపారు, ఈ ఘటన గురించి అర్జున్ మేనమామ సతీష్ కుమార్ మాట్లాడుతూ, ‘రాజేష్ మా బావగారు. సంఘటన గురించి మా మేనల్లుని (అర్జున్) నుంచి నాకు కాల్ వచ్చింది. రాజేష్ ఆర్మీ నుంచి రిటైరై, ప్రస్తుతం ఒక భద్రత అధికారిగా పని చేస్తున్నారు. ఆయన కుమార్తె కాలేజి విద్యార్థిని’ అని వివరించారు. ఆర్థిక వివాదం ఈ దాడికి కారణమై ఉంటుందని కుమార్ అభిప్రాయం వెలిబుచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News