Monday, January 20, 2025

అమెరికాలో రోడ్డు ప్రమాదం… ముగ్గురు తెలుగువారు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్స్: అమెరికాలోని రాండాల్ఫ్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ బాన్‌హామ్ లోని రాష్ట్ర రహదారి 121పై ఆరు మైళ్ల దూరంలో  యుఎస్‌ఎ కాలమానం ప్రకారం ఏడు గంటలకు రెండు వాహనాలు ఢీకొనడంతో ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం చెందారు. మృతులలో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన గోపి, శివ, హరితగా గుర్తించారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. అతి వేగంతో ఈ ప్రమాదం జరిగిందని టెక్సాస్ పబ్లిక్ సెఫ్టీ వర్గాలు వెల్లడించాయి. మృతులు బంధువులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. రెండు వాహనాలు ఢీకొట్టిన వెంటనే మంటలు చెలరేగినట్టు సమాచారం.  ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News