Wednesday, January 22, 2025

పరదీప్ పోర్టులో ముగ్గురు ఘనా జాతీయుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

బొగ్గు లోడుతో వచ్చిన కార్గో నౌకలో అక్రమంగా ప్రయాణించి భారత్‌కు చేరుకున్న ముగ్గురు ఘనా జాతీయులను ఒడిశాలోని పరదీప్ పోర్టులో అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘనా జాతీయులు సిఐఎస్‌ఎఫ్ కస్టడీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. బొగ్గు లోడుతో వచ్చిన ఎంవి గ్రేట్ షెంగ్ వెన్ నౌకను పరదీప్ రేవులో నిలిపి ఉంచగా అందులో దాక్కోవడానికి ప్రయత్నించిన ముగ్గురు ఘనా జాతీయులను అదుపులోకి తీసుకున్నట్లు వారు చెప్పారు. నౌకలో ఉన్న 20 మంది సిబ్బంది వద్ద అధికారిక పత్రాలు ఉండగా ఈ ముగ్గురు వద్ద మాత్రం ఎటువంటి పత్రాలు లేవని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News