Tuesday, January 14, 2025

బాయ్‌ఫ్రెండ్ కోసం విషం తాగిన ముగ్గురు బాలికలు

- Advertisement -
- Advertisement -

Three girls poisoned for boyfriend in Madhya Pradesh

ఇద్దరు బాలికల మృతి, ఒకరి పరిస్థితి విషమం

ఇండోర్: వేర్వేరు కారణాలతో విషం తాగిన 16 సంవత్సరాల వయసున్న ఇద్దరు పాఠశాల బాలికలు మరణించగా మరో బాలిక విషమ పరిస్థితిలో ఉంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో జరిగింది. సెహోర్ జిల్లాలోని ఆష్తా పట్టణంలోని ఒక స్కూలులో చదువుకుంటున్న ఆ ముగ్గురు బాలికలు శుక్రవారం స్కూలుకు డుమ్మా కొట్టి 100 కిలోమీటర్ల దూరంలోని ఇండోర్ పట్టణాన్ని చేరుకున్నారు. ఆ ముగ్గురిలో చనిపోయిన ఒక బాలిక బాయ్‌ఫ్రెండ్‌ను కలుసుకోవడానికే వీరు ముగ్గురూ ఇండోర్ వచ్చినట్లు పోలీసులు శనివారం తెలిపారు. తన ఫోన్‌కాల్స్‌కు స్పందించని తన బాయ్‌ఫ్రెండ్‌ను నేరుగా కలుసుకుని మాట్లాడేందుకు ఆ బాలిక తనకు అత్యంత సన్నిహితులైన ఫ్రెండ్స్‌తో కలసి ఇండోర్ వచ్చినట్లు పోలీసులు చెప్పారు. తన బాయ్‌ఫ్రెండ్ తనను కలుసుకోకపోతే విషం తాగి చనిపోవాలని ఆ బాలిక ముందే నిర్ణయించుకుందని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక వెల్లడించినట్లు పోలీసులు చెప్పారు.

ఆష్తా పట్టణంలోని ఒక షాపులో వీరు విషం కొన్నారని, ఇండోర్ చేరుకోగానే ఆ బాయ్‌ఫ్రెండ్‌ను సంప్రదించడానికి ప్రయత్నించారని పోలీసులు చెప్పారు. భవర్‌కువన్ ప్రాంతం సమీపంలోని ఒక పార్కుకు అతడిని రమ్మన్నారని, అయితే అతను రాకపోవడంతో మనస్థాపం చెంది ఆ బాలిక విషం తాగిందని, దీన్ని చూసి మిగతా ఇద్దరు బాలికలు కూడా విషం తాగేశారని పోలీసులు చెప్పారు. వీరి పరిస్థితి చూసిన పార్కులో ఉన్న పౌరులు వెంటనే వీరిని సమీపంలోని ఎంవై ఆసుపత్రికి తరలించారని, అక్కడ ఇద్దరు బాలికలు మరణించగా మరో బాలిక విషమ పరిస్థితిలో మృత్యువుతో పోరాడుతోందని వారు చెప్పారు. బాలికల తల్లిదండ్రులను ఇండోర్‌కు పిలిపించి వారి వాంగ్మూలాలను నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News