Friday, December 20, 2024

ఒకే రోజు పట్టాలు తప్పిన మూడు గూడ్స్‌రైళ్లు

- Advertisement -
- Advertisement -

దేశంలో శుక్రవారం ఒక్కరోజే మూడు గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పాయి. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘఢ్ వద్ద గూడ్స్‌కు చెందిన ఖాళీ వ్యాగన్లు బొగ్గు కుప్పల వద్ద అదుపు తప్పాయి. ఈ ప్రాంతంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం జరగకుండా పరిస్థితిని చక్కదిద్దినట్లు నార్త్ సెంట్రల్ రైల్వే పౌర సంబంధాల ప్రధానాధికారి శశికాంత్ త్రిపాఠీ ప్రకటించారు. సైడ్‌లైన్‌లో ఈ ఘటన జరిగింది. కాగా ఈరోజే బీహార్‌లోని కతిహార్ రైల్వే డివిజన్ మార్గంలో ఐదు ట్యాంకు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. కర్నాటకలోని హుబ్బలి డివిజన్‌లో మరో గూడ్స్‌రైలుకు చెందిన 17 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. దీరితొ ఈ దారిలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లు రద్దు అయ్యాయని రైల్వే విభాగం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News