Sunday, December 22, 2024

పరిపాలన సౌలభ్యం కోసం భద్రాచలంలో మూడు గ్రామ పంచాయితీలు

- Advertisement -
- Advertisement -
శాసనమండలిలో మరోసారి ఏకగ్రీవ తీర్మానం: మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్: పరిపాలన సౌలభ్యం కొరకు భద్రాచలంను మూడు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ, రాష్ట్ర శాసన మండలిలో మరోసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు గవర్నర్ తిప్పి పంపిన బిల్లును రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయితీ రాజ్ చట్ట సవరణ బిల్లుగా తిరిగి ప్రవేశ పెట్టారు. ఇదే బిల్లును నిన్న అసెంబ్లీలో మంత్రి ప్రవేశ పెట్టగా విధాన సభ ఏకగ్రీవంగా మరోసారి ఆమోదించింది. ఈ బిల్లుపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ భద్రాచలం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ పంపిన నివేదిక ఆధారంగా గతంలో రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ఏకగ్రీవంగా భద్రాచలంలో మూడు గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడానికి తీర్మానించిందని తెలిపారు. ఆ బిల్లును రాష్ట్ర గవర్నర్ తిప్పి పంపారని అట్టి బిల్లును తిరిగి ఆమోదం కోసం సభ ఏకగ్రీవంగా తీర్మాంచినట్లు మంత్రి సభకు వివరించగా అనంతరం ఆ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. భద్రాచలం అటు మున్సిపాలిటీ, ఇటు గ్రామపంచాయతీ కాకుండా అభివృద్ధికి నోచుకోకుండా ఉండాలనేది కొందరి భావన మున్సిపాలిటీ చేద్దామంటే కేంద్ర చట్టాలు అడ్డం వస్తుండగా, పంచాయతీ చేద్దామంటే ఇక్కడ కొంతమంది అడ్డుపడుతున్నారని చెప్పారు. భద్రాచలాన్ని గ్రామపంచాయతీ చేసి అభివృద్ధిలో అన్ని గ్రామాల మాదిరిగా పరుగులు పెట్టిద్దామని గత అసెంబ్లీలో బిల్లుపెట్టి గ్రామపంచాయతీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

భద్రాచలం పరిధిలో 51 వేలకు పైగా జనాభా ఉండటంతో పరిపాలన సౌలభ్యం కోసం మూడు గ్రామపంచాయతీలుగా చేయాలనుకుంటే కొందరు అభివృద్ధి నిరోధకులుగా గవర్నర్ తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఈ బిల్లు ఆమోదించకుండా ఆటంకం కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బిజేపి ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని తీసుకొని ఈ బిల్లు ఆమోదించకుండా గవర్నర్ ఆపిందని అదే సమాచారం ప్రభుత్వాన్ని అడిగి ఉంటే నిజమైన ఇచ్చేవాళ్లమన్నారు.అసెంబ్లీలోని శాసనసభ్యులు తీర్మానం చేసిన స్దానిక శాసనసభ్యుని అనుమతి లేదనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అభివృద్ధి కోసమే భద్రాచలాన్ని మూడు గ్రామ పంచాయితీలుగా భద్రాచలం, సీతారామ నగర్, శాంతినగర్‌గా ఏర్పాటు చేసి
ఈ బిల్లును పునఃప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News