Sunday, December 22, 2024

మిర్యాలగూడలో మూడు ఆసుపత్రులు, ల్యాబ్‌లు, ఐసియు సీజ్

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఆసుపత్రులు నడిపితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండల్‌రావు అన్నారు. గురువారం మిర్యాలగూడలోని ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో గల సేఫ్, కిన్నెర, అనిత అసుపత్రులను, మరో మూడు ల్యాబ్‌లను ఆయన సీజ్ చేశారు.

ఇటీవల వైద్యం పేరుతో ప్రైవేట్ ఆసుపత్రలు ప్రజల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, ప్రభుత్వ నియమ, నిబంధనలు పాటించకుండా అనుమతులు తీసుకోకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నత అధికారులకు ఫిర్యాదులు అందడంతో ఆకస్మిక తనిఖీలను ప్రైవేటు ఆసుపత్రులలో చేపట్టారు. కనీస వసతులు లేకుండా కొన్నచోట్ల అసలు డాక్టర్లే లేరని, డాక్టర్ల పేర్లు లేకుండా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులంటూ బోర్డులను ఏర్పాటు చేసుకొని వైద్యం నిర్వహిస్తున్న తీరు తనిఖీలలో వెలుగు చూసింది.

మా ఆసుపత్రులలో 24 గంటల వైద్య సదుపాయాలు ఉంటాయని, పెద్ద అక్షరాలతో 24 గంటలు వైద్య సదుపాయాలు ఉంటాయని చూపుతూ, నామమాత్రం వైద్యంతో వేలాది రూపాయలు దండుకుంటున్నారని పలువురు ఆసుపత్రుల వద్ద ఆరోపించారు. సౌకర్యాలు ఏమీ లేకున్నప్పటికీ ఆసుపత్రిలో ఏకంగా ఐసియు ఏర్పాటు చేయడం గమనార్హం. ఐసీయు ఏర్పాటు చేయాలంటే 24 గంటలు పనిచేసే ఒక సర్జన్, అనస్తీషియా డాక్టర్, ప్రత్యేకత కలిగిన మరో డాక్టర్, క్వాలిఫైడ్ వైద్య సిబ్బంది ఉంటేనే ఐసీయు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ కనీసం డాక్టర్ లేకుండా ప్రభుత్వ వైద్యుడుచే నవీన ఆసుపత్రులు నడిపిస్తున్నారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News