Monday, December 23, 2024

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మూడు ఇండ్లు దగ్ధం

- Advertisement -
- Advertisement -

చిట్యాల : ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మూడు ఇండ్లు దగ్ధమైన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కైలాపూర్ గ్రామ శివారు శాంతినగర్‌లో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శాంతినగర్ గ్రామానికి చెందిన దానవేని ఐలమ్మ, తిరుపతి ఇండ్లు దగ్గరగా ఉన్నట్లు తెలిపారు. తొలుత ఐలమ్మ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు లేచినట్లు తెలిపారు. గమనించిన గ్రామస్తులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ చల్లారలేదని చెప్పారు. మంటలు ఎగిసిపడి గాలికి తిరుపతి ఇల్లు సైతం అంటుకొని కాలిపోయిందని తెలిపారు. తిరుపతి ఇంట్లో ఉన్న గ్యాస్ పేలి సమీపంలోని చింత నిప్పుల దశరథం ఇంటిపై పడిందని తెలిపారు.

అనంతరం దశరథం ఇల్లు సైతం అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయిందని బాధితులు విలపిస్తూ చెప్పారు. ఈ సంఘటనలో దశరథం అనే బాధితుడికి రూ.12 లక్షల ఆస్తి నష్టం జరిగిందని, దానవేణి తిరుపతికి రూ 11. 50 లక్షల ఆస్తి నష్టం ఐలమ్మకు రూ 1.30 లక్షల ఆస్తి నష్టం జరిగిందని ఆర్.ఐ రాజు ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదంలో సర్వస్వం నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని బిజెపి రాష్ట్ర మహిళా నాయకురాలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చందుపట్ల కీర్తి రెడ్డి, టిపిసిసి కార్యవర్గ సభ్యుడు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గండ్ర సత్యనారాయణ రావులు డిమాండ్ చేశారు. బాధితులను పరామర్శించి, సానుభూతి వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా సర్పంచ్ చింతల శ్వేతా సుమన్ బాధితులను పరామర్శించి ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం చొప్పున, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. బిజెపి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్, గూట్ల తిరుపతి, జిల్లా నాయకుడు చింతకుంట రామయ్య పల్లి సర్పంచ్ ముఖిరాల మధు వంశీకృష్ణ, తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News