Sunday, December 22, 2024

ముగ్గురు హెచ్‌పి ఎమ్మెల్యేల రాజీనామా

- Advertisement -
- Advertisement -

ఇటీవలి రాజ్యసభ ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్‌లో బిజెపి అభ్యర్థికి అనుకూలంగా వోటు వేసిన ముగ్గురు స్వతంత్ర ఎంఎల్‌ఎలు తమ రాజీనామా పత్రాలను శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. వారు ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ సుఖ్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. తాము బిజెపిలో చేరతామని, పార్టీ టిక్కెట్‌పై పోటీ చేస్తామని వారిలో ఒకరు విలేకరులతో చెప్పారు. ముగ్గురు ఎంఎల్‌ఎలు ఆశిష్ శర్మ (హమీర్‌పూర్), హోషియార్ సింగ్ (దెహ్రా), కెఎల్ ఠాకూర్ (నాలాగఢ్) శుక్రవారం సిమ్లా చేరుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు జైరామ్ ఠాకూర్, ఇతర బిజెపి ఎంఎల్‌ఎలు వెంట రాగావారు తమ రాజీనామా పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి యశ్ పాల్ శర్మకు అందజేశారు.

‘మేము రాజీనామాలు సమర్పించాం. బిజెపిలో చేరిఆ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేస్తాం’ అని హోషియార్ సింగ్ విలేకరులతో చెప్పారు. ఆ ముగ్గురు 2022 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి టిక్కెట్లు కోరారు. కాని టిక్కెట్లు రాకపోవడంతో ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. అయితే, కాంగ్రెస్ 40 మంది శాసనసభ్యులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ ముగ్గురు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ముగ్గురు స్వతంత్ర ఎంఎల్‌ఎలు ఆరుగురు కాంగ్రెస్ రెబెల్ ఎంఎల్‌ఎలతో పాటు క్రితం నెల రాజ్యసభ ఎన్నికలలో బిజెపి అభ్యర్థికి అనుకూలంగా వోటు వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News