Monday, January 20, 2025

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారత సంతతి విద్యార్థుల మృతి

- Advertisement -
- Advertisement -

అమెరికాలోని జార్జీయా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారత సంతతి విద్యార్థులు మరణించారు. ఈ నెల 14వ తేదీన ఘటన చోటు చేసుకోగా అల్ఫారెట్టా పోలీసులు తాజాగా వివరాలు వెల్లడించారు. జార్జియా యూనివర్శిటీలో చదువుతున్న శ్రీయా, ఆర్యన్ జోషి, రిత్వక్ సోమేపల్లి, అన్వీ శర్మ, మహ్మద్ లియాకత్ కారులో ఓ కార్యక్ర మానికి బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న కారు జార్జియాలోని అల్ఫారెట్టా వద్ద అదుపు తప్పి బలంగా చెట్టును ఢీకొంది. ప్రమాదస్థిలిలోనే శ్రీయా, ఆర్యన్ జోషి ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మిగతా వారిని ఆస్పత్రికి తరలిం చారు. ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలోనే అన్వీ శర్మ కూడా మృతి చెందారు. ప్రస్తుతం ఆస్పత్రిలో రిత్వక్ సోమేపల్లి, మహ్మద్ లియాకత్ చికిత్స పొందుతున్నారు.

ఈ కారు ప్రమాదానికి అతి వేగమే కారణమని అక్కడి పోలీసులు అంచనా వేస్తు న్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. గత నెలలో అరిజోనాలోని లేక్ ప్లెసెంట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమా దంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి చెందా రు. అంతకు ముందు ఎపికి చెందిన ఓ కుటుంబం కూడా రోడ్డు ప్రమాదం బారిన పడింది. ఎపి లోని ఎన్‌టిఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొణకంచి గ్రామానికి చెందిన కమతం నరేష్ ఆయన భార్య గీతాంజలి అమెరికాలో నివసిస్తున్నా రు. వీరికి ఆరు సంవత్సరాల కూతురు హీనిక, మూడేళ్ల కుమారుడు బ్రమణ్ ఉన్నాడు. వీరి కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరి గింది. ప్రమాదంలో గీతాంజలి, హీనిక మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News