Sunday, December 22, 2024

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు గుజరాతీ మహిళల మృతి

- Advertisement -
- Advertisement -

అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి గుజరాత్‌కు చెందిన ముగ్గురు మహిళలు మరణించారు. గ్రీన్‌విల్లె కౌంటీలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీషాబెన్ పటేల్‌గా గుర్తించారు. వారు ప్రయాణిస్తున్న ఎస్‌యువి నాలుగు వరుసలను దాటుకుని 20 అడుగుల ఎత్తుకు ఎగిరి ఒక చెట్టుకు చిక్కుకుందని పోలీసులు తెలిపారు. ప్రమాదం తీవ్రతకు కారు ముక్కలైపోయిందని చీఫ్ డిప్యుటీ కొరోనర్ మైక్ ఎల్లీస్ తెలిపారు.

అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా కనపడుతోందని, ఈ ప్రమాదంలో వేరే కార్లు వేటికీ ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. హైవేపై వెళుతున్న కారు తన మార్గాన్ని వదిలి నాలుగు నుంచి ఆరు వరుసల రోడ్లును దాటుకుని 20 అడుగుల ఎత్తులో చెట్టుపైకి చేరుకోవడాన్ని బట్టి చూస్తే ఆ కారు ఎంత వేగంగా వెళుతోందో అర్థం చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాలుగో వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News