- Advertisement -
కడ్తాల్: రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండలం పడకల్ చౌరస్తాలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు, లారీ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు.
- Advertisement -