Sunday, December 22, 2024

ముంబై నటి జెత్వానీ కేసులో ఇర్కుకున్న ఐపిఎస్‌లు

- Advertisement -
- Advertisement -

ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వానీని వేధించిన కేసులో ముగ్గురు సీనియర్ ఐపిఎస్ అధికారులపై సీరియస్ కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే విచారణ అధికారి స్రవంతి రాయ్ డిజిపికి నివేదిక సమర్పిం చినట్లుగా తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే హీరోయిన్ జత్వానీపై కేసు పెట్టి కుటుంబం మొత్తాన్ని విజయవాడకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేశారని రిపోర్టులో పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. హీరోయిన్ జెత్వానపై వైసిపి నాయకుడు కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టిన రోజు సాయంత్రమే ముంబైకి ప్రత్యేక పోలీసు బృందం వెళ్లింది. అయితే వారు అలా వెళ్లడానికి అవసరమైన విమానం టిక్కెట్లను ముందు రోజే బుక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టడానికి ముందే ముంబైకి వెళ్లేందుకు పోలీసు బృందం టిక్కెట్లు బుక్ అయ్యాయి. ప్లాన్ ప్రకారమే ముందుగా అన్నీ రెడీ చేసుకుని ఆ తర్వాత కుక్కల విద్యాసాగర్ తో తప్పుడు ఫిర్యాదు తీసుకుని హీరోయిన్ జెత్వానీ కటుంబాన్ని తీసకొచ్చేందుకు ప్రయత్నించారని, దానికి ముందుగానే టిక్కెట్లు తీసుకున్న వైనమే అసలైన సాక్ష్యమని అంటున్నారు.

అదే సమయంలో జెత్వానీ తమకు కుక్కల విద్యాసాగర్‌కు చెందిన భూమి అమ్మకానికి పెట్టిందని రూ. ఐదు లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకుందని, పోలీసులు గతంలో ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వ్యక్తులు కూడా ఇప్పుడు అడ్డం తిరిగారు. తమకు అసలు జెత్వానీన తెలియదని, ఆమె తమకు భూమి అమ్మజూపలేదని స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనం కోసం టిక్కెట్లు ఇప్పిస్తానని చెప్పి కుక్కల విద్యాసాగర్ తమ ఆధార్ కార్డులు తీసుకుని దుర్వినియోగం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కేసు పెట్టడానికి ఉపయోగిచిన డాక్యుమెంట్లు.. జెత్వానీవి కావని, వాటిని పోలీసులే తయారు చేశారన్న ఆరోపణలపైనా విచారణ అధికారి నివేదికలో స్పష్టత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో తనను ముగ్గురు ఐపిఎస్ అధికారులు వేధించారని జెత్వానీ ఫిర్యాదు చేశారు. అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయలు, అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, డిసిపి విసాల్ గున్నీ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని ఫిర్యాదు చేశారు.

ఈ ముగ్గురిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. విశాల్ గున్ని నేతృత్వంలో ముంబైకి వెళ్లిన పోలీసు టీంలో చాలా మంది.. అప్పుడేం జరిగిందో పూర్తిగా పోలీసులకు వివరించారు. తాము ఉన్నతాధికారులు చెప్పిందే చేశామని వారు వాంగ్మూలం ఇచ్చారు. ఆ పోలీసులు చెప్పిన దాంట్లోనూ సంచలన విషయాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. హీరోయిన్ జెత్వానీ కేసులో దేశం మొత్తం ఆశ్చర్యపోయే సంచలన విషయాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News