Wednesday, November 13, 2024

ఇరానీ గ్యాంగ్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

Three Iranian gang members arrested by Rachakonda police

దృష్టిమరల్చి చోరీలు చేస్తున్న ముగ్గురు నిందితులు
దుస్తుల వ్యాపారం కోసం ఇండియా వచ్చిన ఇరానీలు
అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు
వివరాలు వెల్లడించిన సిపి మహేష్ భగవత్

మనతెలంగాణ, హైదరాబాద్ : దృష్టి మరల్చి దొంగతనాలు చేస్తున్న ముగ్గురు ఇరానీ గ్యాంగ్ సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.35,000నగదు, 811 అమెరికా డాలర్లు, మారుతి కారును స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇరాన్, టెహరాన్, వరామిన్‌కు చెందిన మహ్మద్ హుస్సేన్, వాహిద్ రాజాబ్, నాసీర్ అబిహిది దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. ముగ్గురు నగరానికి వచ్చి టోలీచౌకిలోని పారామౌంట్ కాలనీలో ఉంటున్నారు. ముగ్గురు నిందితులు టూరిస్టు వీసాపై ఇండియాకు వచ్చారు. వీరు ముగ్గురు ఢిల్లీలో దుస్తులు కొనుగోలు చేసి ఇరాన్‌లో విక్రయిస్తున్నారు. ఇండియా దుస్తులకు ఇరాన్‌లో ఎక్కువ డిమాండ్ ఉండడంతో గత కొన్ని ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దుస్తులు కొనుగోలు చేసేందుకు ఇండియా వచ్చిన ముగ్గురు కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో ఇక్కడే ఉండిపోయారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్నా తెలంగాణలో లేకపోవడంతో నగరానికి వచ్చారు.

ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడడంతో చోరీలు చేయడం ప్రారంభించారు. ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్సురాబాద్‌లోఉన్న రైస్ షాపుకు వెళ్లారు. అక్కడ రైస్ కావాలని అడిగారు, తమ వద్ద అమెరికా డాలర్లు ఉన్నాయని చెప్పారు. వాటిని మార్చుకోవాలని చెప్పారు, అదే సమయంలో మరో కస్టమర్ రావడంతో యజమాని అతడితో మాట్లాడుతున్నాడు. ఇదే అదునుగా భావించిన నిందితులు కౌంటర్‌లో ఉన్న రూ.30,000 తీసుకుని పారిపోయారు. సాగర్ ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న క్యాస్ట్రాల్ ఆయిల్ షాపుకు వెళ్లారు. తమకు అమెరికా డాలర్లను ఎక్సేంజ్ చేయాలని కోరారు. దానికి అంగీకరించి డబ్బులను లెక్కిస్తుండగా దృష్టిమరల్చి రూ.22,000 తీసుకుని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు. ముగ్గురు నిందితులు ఎల్‌బినగర్ పిఎస్ పరిధిలో రెండు కేసులు, రాజేంద్రనగర్, కార్ఖానా పిఎస్, నార్సింగి పిఎస్ పరిధిలో చోరీలు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్లు నిందితులను అరెస్టు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News