Saturday, December 21, 2024

ట్రాఫిక్ హోంగార్డు విధులకు ఆటంకం కల్గించిన ముగ్గురికి జైలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు విధులకు ఆటంకం కల్గించిన ముగ్గురు యువకులకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు జనార్దన్ ఈ నెల 8వ తేదీన నిలోఫర్ ఆస్పత్రి ఎక్స్ రోడ్డు వద్ద నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులు ఫొటోలు తీస్తున్నాడు. ఈ క్రమంలోనే గౌస్ ఖాన్, జాఫర్ ఖాన్, సాబీర్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఫొటో తీశాడు.

దీనిని గమనించిన ముగ్గురు హోంగార్డు జనార్దన్ వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా హోంగార్డును కొట్టి, షర్ట్‌ను చింపివేశారు. దీంతో హోంగార్డు జనార్దన్ ముగ్గురిపై నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా ముగ్గురికి జైలు శిక్ష విధించింది. డిఎస్సై రమేష్ ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News