Thursday, November 14, 2024

కొండచరియలు విరిగిపడి ముగ్గురి మృతి

- Advertisement -
- Advertisement -

జమ్ము కశ్మీర్: జమ్ము కశ్మీర్ లోని కథువా జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మరో చోట కొండచరియలు విరిగి పడడంతో ముగ్గురు మృతి చెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బాని ప్రాంతంలో నివసిస్తున్న అబ్దుల్ ఖయ్యూం, ముస్తాక్ అహ్మద్‌లు తమ కుటుంబాలతో రెండు వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారు. అయితే భారీ వర్షాలకు ఇళ్లు ఒక్కసారి కూలిపోగా అబ్దుల్ ఖయ్యూం కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు. వారి మృతదేహాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి.

అధికారులు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలను వెలికి తీశారు. మరో చోట కొండచరియలు విరిగి పడడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక బాలుడు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా జమ్ముకశ్మీర్ లోని చాలా ప్రాంతాల్లో ఆకస్మికంగా వరదలు ముంచెత్తాయి. పలు చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. శ్రీనగర్ జమ్ము జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు.

సియాచిన్ గ్లేసియర్‌లో అగ్ని ప్రమాదం… ఆర్మీ అధికారి మృతి
హిమాలయాల్లోని సియాచిన్ గ్లేసియర్‌లో బుధవారం తెల్లవారు జామున అగ్నిప్రమాదంలో ఆర్మీ ఆఫీసర్ మృతి చెందారు. మరో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీప ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన ఆఫీసర్ కెప్టెన్ అన్హుమాన్ సింగ్‌గా గుర్తించారు. సియాచిన్‌లో మందుగుండు సామాగ్రి డంప్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన కెప్టెన్ సింగ్ తోటి సైనికులను కాపాడే ప్రయత్నంలో మంటల్లో చిక్కుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News