Thursday, January 30, 2025

ఢిల్లీలో నాలుగంతస్తుల భవనం కూలి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీలోని బురారి ప్రాంతంలో సోమవారం సాయంత్రం నాలుగంతస్తుల భవనం కూలి ఇద్దరు అమ్మాయిలు సహా మొత్తం ముగ్గురు మరణించారని పోలీసులు మంగళవారం తెలిపారు. ఆస్కర్ పబ్లిక్ స్కూల్ సమీపంలో కొత్తగా కడుతున్న భవనం కూలిపోయింది. ఇప్పటి వరకు 12 మందిని కాపాడినట్లు, మూడు శవాలను శిథిలాల నుంచి వెలికి తెచ్చినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో సాధన(17), రాధిక(7), మరో వ్యక్తిని ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు వివరించారు. ఇప్పటికీ రెస్కూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సమాచారం. ‘మేము దర్యాప్తును ప్రారంభించాము. అనేక టీమ్‌లను రూపొందించాము. బిల్డింగ్ ఓనర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము’ అని ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఇదిలావుండగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి ‘ఎక్స్’ పోస్ట్‌లో బాధితులకు వీలయినంత సాయం అందిస్తామని పేర్కొన్నారు. కాగా సాయక చర్యలో సాయపడమని స్థానిక పార్టీ ఎంఎల్‌ఏకు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. ఢిల్లీ అగ్నిమాపక దళం చీఫ్ సాయక చర్యల వీడియోను మంగళవారం విడుదలచేశారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికి తీయడానికి డిఎఫ్‌ఎస్ సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని డిఎఫ్‌ఎస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News