Sunday, December 22, 2024

చెట్టును ఢీకొట్టిన ఆటో: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three killed in road accident at Adilabad district

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూర్ మండలం గోదరిగూడ సమీపంలో ఆటో చెట్టును డీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులను నిర్మల్ జిల్లా కుంటాల, భైంసా వాసులుగా గుర్తించారు. వసతిగృహాల్లోని పిల్లలను తీసుకొచ్చేందుకు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News