Wednesday, January 22, 2025

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, వెంకటాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని జగిత్యాల నుండి కోరుట్ల ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో కొండగట్టుకు చెందిన శ్రీకాంత్ (27), వెంకటేష్ (33) అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన వేణుగోపాల్‌ను జగిత్యాల ఆసుపత్రికి చికిత్స తరలించగా ఆసుపత్రిలో మృతి చెందాడు.

సంఘటనా స్థలాన్ని కోరుట్ల సిఐ సురేష్ బాబు, కోరుట్ల ఎస్‌ఐ కిరణ్ కుమార్, మేడిపల్లి ఎస్‌ఐ శ్యాం రాజ్ సందర్శించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కోరుట్ల, జగిత్యాల ఆసుపత్రి వద్ద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా, మృతుడు వెంకటేష్‌కు బంధువులు ఎవరూ లేకపోవడంతో పోలీసులే దహన సంస్కారాలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News