Sunday, January 19, 2025

యాదాద్రి భువనగిరిలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

three killed in road accident in Yadadri bhuvanagiri

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన డిసిఎం, స్కూటీని డీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. భువనగిరి మండలం హన్మాపురం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News