Sunday, November 24, 2024

ఆర్‌టిసి బస్సు ఢీకొని ముగ్గురి మృతి

- Advertisement -
- Advertisement -

Three killed in RTC bus collision

ఒకే కటుంబానికి చెందిన ముగ్గురు మృతి

మనతెలంగాణ/పేట్‌బషీరాబాద్ : ఆర్‌టిసి బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ము గ్గురు దుర్మరణం పాలైన సంఘటన పేట్‌బషీరాబాద్ పో లీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నంలోని హర్తమూరుకు చెం దిన శ్రీనివాస్ పైడమ్మాలు దంపతులు. బతుకు దెరువు కో సం నగరానికి వలస వచ్చి మూడు సంవత్సరాలుగా బహదూర్‌పల్లి ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్ కూలీ పనులు చేయగా పైడమ్మ(40) కుమారుడు కాళీ కృష్ణ (22), కూతురు శ్రీవల్లి(18) అపురూపకాలనీలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తుంటారు. కృష్ణ, శ్రీవల్లి ఒకే పరిశ్రమలో పనిచేయగా తల్లి పైడమ్మ పక్కన గ ల మరో పరిశ్రమలో పని చేస్తుంది.

రోజు మాదిరిగానే బు ధవారం సాయంత్రం విధులు ముగించుకుని కృష్ణ, తల్లి, చెల్లె తన ద్విచక్ర వాహనంపై (ఎపి 29 క్యూ 9837)పై ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో దూలపల్లి ఫారెస్టు అ కాడమీ వద్ద మైసమ్మగూడ నుంచి దూలపల్లికి వస్తున్న జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు(ఎపి 11 జెడ్ 6184 ) ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం అందుకున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రెండు నెలల క్రితం మచిలీపట్నం బోరముతూ పాలెంకు చెందిన కొమలితో కాళీ కృష్ణకు వివాహం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News