Sunday, February 23, 2025

రష్యన్ కిండర్‌గార్టెన్‌లో కాల్పులు: ముగ్గురి మృతి

- Advertisement -
- Advertisement -

Three killed in Russian kindergarten shooting

మాస్కో: మాస్కోలోని ఒక రష్యన్ కిండర్‌గార్టెన్‌లోకి చొరపడిన ఒక సాయుధుడు ఇద్దరు పిల్లలను, ఒక మహిళా ఉద్యోగిని తుపాకీతో కాల్చిచంపినట్లు ఫెడరల్ శాసనకర్త ఒకరు తెలిపారు. సెంట్రల్ రష్యాలోని వెష్‌కేమా పట్టణంలోని ఒక కిండర్‌గార్టెన్‌లోకి చొరపడిన ఒక వ్యక్తి కాల్పులు జరపడంతో ఇద్దరు పిల్లలు, ఒక మహిళా ఉద్యోగిని మరణించినట్లు ఫెడరల్ శాసనకర్త, మాజీ గవర్నర్ సెర్జీ మొరోజోవ్ తన సోషల్ నెట్‌వర్క్ వికెలో రాశారు. ఈ వార్తను స్థానిక ఆరోగ్య అధికారులు ధ్రువీకరించారు. ఈ సంఘటనలో మరో ఉద్యోగి కూడా గాయపడినట్లు వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News