Saturday, November 23, 2024

అమెరికాలో బైక్ ర్యాలీపై కాల్పులు..

- Advertisement -
- Advertisement -

మెక్సికో: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. శనివారం న్యూమెక్సికో లోని రెడ్ రివర్ ఏరియాలో మోటార్ ర్యాలీపై దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవగా, మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కోసం డెన్వర్‌కు అంబులెన్స్‌లో తరలించినట్టు న్యూమెక్సికో స్టేట్ పోలీస్‌లు చెప్పారు. గాయపడిన మరో నలుగురిని అల్బుకార్క్ లోని హోలీ క్రాస్ ఆస్పత్రికి, హెల్త్ యూనివర్శిటీకి తరలించారు. కాల్పులకు పాల్పడిన నిందితులు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారని మేయర్ లిండా కాల్హాన్ చెప్పారు.

వారంతా బైకర్ గ్యాంగుల ముఠా అని చెప్పారు. వారాంతపు మెమోరియల్ డే సందర్భంగా జరిగిన వార్షిక మోటారు సైకిల్ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. ర్యాలీని లక్షంగా చేసుకుని కాల్పులు జరిపి ఉంటారని పోలీస్‌లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఘటనాస్థలం సురక్షితంగా ఉందని, ప్రజా భద్రతకు ఎలాంటి ముప్పులేదని తెలిపారు. న్యూమెక్సికోలో రెండు వారాల వ్యవధి లోనే రెండుసార్లు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల 16న జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు పోలీస్ అధికారులు గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News