Tuesday, January 21, 2025

మంజీరా నదిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

సదాశివపేట : సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామంలో శనివారం ఘోర ప్రమాదం సంభవించింది. మంజీరా నదిలోకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను గోపాల్(30), రమణ(45), మల్లేష్(30)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెళికి తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో పండగ పూట విషాద చాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News