- Advertisement -
నార్సింగ్: హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పిరిధిలోని పుప్పాలగూడలో శనివారం విషాదం చోటుచేసుకుంది. సెల్లార్ గుంత తీస్తుండగా గోడ కూలి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రస్తుతం సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు. మృతులను బీహార్ చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురికీ తరలించారు. అంనతరం దర్యాప్తు చేస్తున్నామని నార్సింగ్ పోలీసుల వెల్లడించారు.
- Advertisement -