Wednesday, January 22, 2025

జియాగూడలో విషాదం.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ జియాగుడలో విషాదం చోటుచేసుకుంది. డ్రైనేజ్ పైప్ లైన్ రిపేర్ కోసం దిగిన ముగ్గురు కూలీల మృత్యువాత పడ్డారు. కుల్సుంపురలో డ్రైనేజ్ పైప్ లైన్ మరమ్మత్తులు జరుగుతుండగా రిపేర్ కోసం ముగ్గురు 12 ఫీట్ల లోతున్న మ్యాన్ హోల్ లోకి దిగారు. లోపల ఊపిరాడక చనిపోయారు. మృతులను శ్రీనివాస్ (40), హనుమంతు (40), వెంకట్రాములు (48)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. కూలి పని కోసం వచ్చి మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించలేదని కుటుంబీకులు వాపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News