Monday, January 20, 2025

ప్రహరీ కూలి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి : జిల్లా కేంద్రంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. సెల్లార్ పనుల్లో నిమగ్నమైన కూలీలపై పక్కనే ఉన్న ఖాళీ స్థలం కోసం నిర్మించిన గోడ కూలడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకెళ్తే… జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌర స్తా వద్ద భవన నిర్మాణంలో భాగంగా సెల్లార్ పనులు చేస్తుండగా పక్కనే ఉన్న మరో స్థలానికి చెందిన ప్రహరీ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరిని గుర్తించిన స్థానికులు శిథిలాల నుండి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. వీరంతా కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా, చింతనమనెల్లి మండలానికి చెందిన వారని తెలుస్తోంది. ఉపాధి కోసం మంచిర్యాలకు వచ్చి భవన నిర్మాణ కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. శంకర్, పోషన్న మానెపల్లికి చెందిన వారు కాగా హన్మం తు రత్నాపూర్ నివాసిగా స్థానికులు తెలిపారు. భవన నిర్మాణంలో భాగంగా సెల్లార్‌లోని పిల్లర్ పనుల్లో నిమగ్నమై ఉన్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన సిపి
జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా సమీపంలో ఓ ఇంటి నిర్మాణం పనులను చేస్తుండగా గోడ కూలి మగ్గురు కూలీలు మృతి చెందిన విషయం తెలుసుకున్న సిపి శ్రీనివాస్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని అభిప్రాయపడ్డారు. సంఘటనకు సంబంధించిన దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News