Sunday, December 22, 2024

భవనం సెంట్రింగ్ కూలి ముగ్గురి దుర్మరణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కెపిహెచ్‌బి: కెపిహెచ్‌బి అడ్డగుట్ట కాలనీలో గురువారం విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనానికి సెంట్రింగ్ పనులు చేస్తుండగా గోడ కూ లి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అడ్డగుట్ట కా లనీలో ప్లాటు నెంబరు 176పి, 177పి, 182పిలోని 668 చదరపు గజాలలో దాస రి సంతోష్, దాసరి శ్రీరామ్‌లు కలిసి సిల్ట్ ప్ల స్ 5 అనుమతులు పొందారు. గురువారం ఉదయం భవనం ఐదవ అంతస్తుపై కూలీ లు పిట్టగోడ నిర్మిస్తుండగా పిట్టగోడ ఒక్కసారిగా కూలిపోవడంతో అదే అంతస్తులో సెంట్రింగ్ పనిచేస్తున్న కూలీలపై గోవా కర్రలు విరిగిపడ్డాయి. దీంతో ఐ దుగురు కూలీలు కిందపడిపోయారు.

వీరిలో ముగ్గురు అక్కడికక్కడే మృ తి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. కూలీలుగా పనిచేస్తున్న వారంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారని పో లీసులు నిర్ధారించారు. వారిలో సాన్య బదనాయక్ (21), సోనియా బదానాయక్ (22), సానియా బద్నానాయక్ (20)లు మృతి చెందారని పోలీసులు తెలిపారు. బిదా బదనాయక్, బిస్త్ర బదనాయక్‌లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారి బంధువులకు పోలీసులు ఒడిస్సాకు ఫోన్‌చేసి సమాచారం అందించినట్లు తెలిపారు. నిర్మాణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేపీహెచ్‌బి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కూకట్‌పల్లిలో అంతులేని అక్రమ నిర్మాణాలు
బిల్డర్ల దురాశ, అధికారుల అవినీతి మూలంగా అమాయకపు ప్రాణాలు బలి అవుతున్నాయి. గత కొద్దినెలల క్రితం కూకట్‌పల్లి డివిజన్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో పనిచేస్తూ కార్మికులు మృతి చెందిన ఘటనలు మరువక ముందే అడ్డగుట్టలో అదే తరహా ఘటన చోటు చేసుకోవడం అందరినీ కలచివేస్తోంది. కూకట్‌పల్లి , మూసాపేట జంట సర్కిళ్ల పరిధి లో కొంత మంది నాయకుల అండ చూసుకుని బిల్డర్లు చెలరేగిపోతున్నా రు. ఆకాశమే హద్దుగా ఎలాంటి సెట్‌బ్యాక్ నిబంధనలు పాటించకుండా ఆరు ఆపై అంతస్తుల నిర్మాణాలు చేపడుతూ టౌన్‌ప్లానింగ్ వ్యవస్థకే స వాల్ విసురుతున్నారు. అడ్డగట్ట సొసైటీ కాలనీలో సిల్ట్ ప్లస్ టూ అనుమతులు పొందిన బిల్డర్లు అత్యాశతో అక్రమంగా ఆరో అంతస్తు నిర్మాణం చేపట్టడానికి సెంట్రింగ్ పనులు చేయిస్తుండడం, నాసిరకం మెటీరియల్ తో గోడ నిర్మాణం చేపడుతుండటం కారణంగా గోవా కర్రలు విరిగిపడి అమాయకులైన ముగ్గురు కార్మికులు మృత్యువాతపడ్డారు. ఈ తరహా ఘటనలు పునరావృతంకాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News