Monday, November 18, 2024

సిపిఎస్ రద్దు కొరకు మూడు లక్షల కుటుంబాలు ఎదురుచూపులు

- Advertisement -
- Advertisement -

త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలి
మంత్రి కెటిఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన సిపిఎస్ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ

మనతెలంగాణ/హైదరాబాద్: సిపిఎస్ రద్దు కొరకు మూడు లక్షల కుటుంబాలు ఎదురుచూపులు చూస్తున్నాయని, త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ను కలిసి శనివారం విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల ఆకాంక్ష మేరకు చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని వారు మంత్రి కెటిఆర్‌కు విన్నవించారు.

ఈ సందర్భంగా సిపిఎస్ రద్దుతో పాటు పాత పెన్షన్ విధానం అమలుకు సంబంధించి సంపూర్ణ నివేదికను మంత్రి కెటిఆర్‌కు వారు అందించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ సిపిఎస్ రద్దు చేసిన రాష్ట్రాల్లో పాత పెన్షన్ అమలు అవుతున్న తీరు గురించి స్థితప్రజ్ఞను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఏటా 2 వేల కోట్ల రూపాయాలు షేర్ మార్కెట్ లోకి వెళ్తున్నాయని, పాత పెన్షన్ అమలు వల్ల ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నయా పైసా భారం ఉండదని మంత్రి కెటిఆర్‌కు సిపిఎస్ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ లెక్కలతో సహా వివరించారు. దీంతో మంత్రి కెటిఆర్ సిపిఎస్ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ నుంచి దానికి సంబంధించిన లెక్కలను తీసుకొని త్వరలోనే దీనిపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని ఆయన హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావులు పాల్గొన్నారు.

KTR

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News