Wednesday, January 8, 2025

ట్రాక్టర్ ను ఢీకొట్టిన బైక్.. ముగ్గురు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధుగిరి జిల్లా పట్టణంలోని ఓబాలాపూర్ గేట్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున మోటార్ సైకిల్ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు మధుగిరి తాలూకాలోని గుడ్డెనహళ్లి గ్రామానికి చెందిన మహ్మద్ ఆసిఫ్ (12), ముంతాజ్ (38), షాకిర్ హుస్సేన్ (48)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులతో వెళ్తున్న బైక్, ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.

ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే, ముగ్గురు బాధితులు తీవ్రగాయాలతో మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News