- Advertisement -
దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భద్రత బలగాలు, మవోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దంతెవాడలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్ – దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు దాక్కున్నారని సమాచారం అందుకున్న భద్రత బలగాలు ఉదయం నుంచి అడవుల్లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు మావోలు మృతి చెందగా.. ఘటనస్థలిలో మృతదేహాలతో పాటు.. ఆయుధాలు, పేలుడు పదార్థలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.
- Advertisement -