Sunday, January 5, 2025

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దులోని గరియాబంద్ జిల్లా, అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం అందిందని గరియాబంచ్ ఎస్‌పి తెలిపారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. శుక్రవారం ఉదయం ఛత్తీస్‌గఢ్ స్పెషల్ ఫోర్స్, డిఆర్‌జి, సిఆర్‌పిఎఫ్ బృందాలు సంయుక్తంగా కూంబింగ్ చేస్తుండగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టులు వారికి తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరువైపులా కాల్పుల మోతతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఎన్‌కౌంటర్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఐఇడి పేలి ముగ్గురు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఇడి (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్ల్లోజివ్ డివైస్) పేలడంతో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడ్క అటవీ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ చేస్తున్న భద్రత బలగాలు మావోయిస్టులు అమర్చిన ఐఇడిను ప్రమాదవశాత్తు తొక్కడంతో ముగ్గురు డిఆర్‌జి (డిస్ట్రిక్ట్ రిజర్వుడ్ గార్డ్) జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ అటవీ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అక్కడ పోలీసు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News