Wednesday, March 26, 2025

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

- Advertisement -
- Advertisement -

ముగ్గురు మావోయిస్టులు హతం
మృతుల్లో అగ్రనేత సుధాకర్
అలియాస్ సుధీర్ ఆయన
స్వస్థలం వరంగల్ జిల్లాలోని
తర్లపల్లి గ్రామం

మన తెలంగాణ/దుమ్ముగూడెం: చత్తీస్‌గఢ్ రా ష్ట్రం, బీజాపూర్, దంతెవాడ జిల్లా ల సరిహద్దు ల్లో మంగళవారం ఉదయం ఎన్‌కౌంటర్ చో టు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టుల హతమయ్యారు. మృతుల్లో మా వోయిస్టుల సౌత్ జోన్ సెంట్రల్ కమిటీ సభ్యు డు (ఎస్‌జడ్‌సిఎం), మా వోల అగ్రనేత అంకేసరపు సారయ్య అలియాస్ సుధాకర్ అలియాస్ సుధీర్ అలియా స్ అలియాస్ సోన్నాయి అలియాస్ మురళి (58)కూఏడా ఉన్నారు. తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని తర్లపల్లికి చెందిన సుధాకర్‌పై రూ.25 లక్షల రివార్డు ఉంది. నిఘా వర్గాల పక్కా స మాచారం మేరకు ఇంద్రావతి నది తీరాన భా రీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో రెండు

జిల్లాలకు చెందిన సిఆర్‌పిఎఫ్, డిఆర్‌జి సంయుక్త బలగాలు 500 మందితో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ సందర్భంగా మావోల మృతదేహాలతో పాటు ఐఎన్‌ఎస్‌ఎఎస్ రైఫిల్స్, భారీఎత్తున పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని దంతెవాడ ఎస్‌పి గౌరవ్ రాయ్, ఏఎస్‌పి ఆర్‌కె బర్మాన్ తెలిపారు. సెర్చింగ్ ఆపరేషన్ ముగిసిన అనంతరం చనిపోయిన మావోయిస్టుల మృతదేహాల గుర్తింపు ప్రక్రియ చేపడతామని డిఐజి కమ్లోచన్ కశ్యప్ తెలిపారు. ఇదిలావుండగా, ఈ నెల 20న భారీ ఎన్‌కౌంటర్‌లో బీజాపూర్ కాంకేర్ జిల్లాలోని 30 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఇప్పటివరకు చోటుచేసుకున్న పలు ఎన్‌కౌంటర్లలో 90 మందికి పైగా నక్సల్స్ మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News