Sunday, December 22, 2024

ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ జనగామటౌన్ : ఆంధ్రప్రదేశ్ నుంచి వరంగల్ మరియు జనగామకు గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు స్మగ్లర్లను నర్మెట పోలీసులు అరెస్టు చేసి వీరి నుంచి పోలీసులు సుమారు రూ.85వేల విలువైన 4.250 కిలోల గంజాయి, 3 సెల్‌ఫోన్లు మరియు 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు జనగామ సీతారం తెలిపారు. మంగళవారం ఆయన జనగామలో నిందితులను, వారి నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తును మీడియా ఎదుట ప్రదర్శించారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ తెల్లవారుజామున నర్మెట ఎస్సై మరియు సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నర్మెట శివారులోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని తనిఖీ చేయగా వారు ఎండు గంజాయి రవాణా/విక్రయాలు చేస్తున్నట్లు తెలుసుకున్నారు.

నిందితుల్లో తరిగొప్పులకు చెందిన ఎండీ.జలీల్ (25), కొడకండ్ల మండలం రెగ్యులతండాకు చెందిన లోతు నవీన్ (30), కలోతు చందులాల్ (70) ఉన్నారు. వీరు స్కూల్, కాలేజీ విద్యార్థులకు గంజాయిని అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. కాగా వీరి ద్వారా ఇప్పటికీ 34 మంది గంజాయి తాగే వారిని గుర్తించడం జరిగిందన్నారు. జనగామ జిల్లాలోని పలు మండలాల్లో వీరు విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. స్మగ్లర్లను పట్టుకోవడంలో నర్మెట పోలీసుల చాకచక్యాన్ని డీసీపీ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News