Wednesday, January 22, 2025

అమెరికాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలోని న్యూహావెన్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ వ్యాన్, కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన ముగ్గురు తెలుగు వారు ప్రేమ్ కుమార్ రెడ్డి(హైదరాబాద్), పావని(వరంగల్), సాయినర్సింహ్మా(రాజమండ్రి) అని పోలీసులు తెలిపారు.

డిల్‌రేల్ బీచ్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఆయిల్ ట్యాంకర్ నుంచి మంటలు రావడంతో ఐదుగురు మృతి చెందడంతో పాటు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆయిల్ ట్యాంకర్ లేన్‌లోకి కారు రావడంతో ట్యాంకర్ డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేశాడు. దీంతో ట్యాంకర్ పక్కన ఉన్న పిట్టగొడకు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ట్యాంకర్‌తో పాటు ఐదు వాహనాలు బూడిదలాగా మారిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News