Saturday, January 11, 2025

మర్చాలలో బోల్తాపడిన కారు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three Members dead in Car accident in Macharla

 

కల్వకుర్తి: నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మర్చాల శివార్లలో కారు బోల్తాపడడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు మిర్యాలగూడకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మహబూబాబాద్ కి చెందిన కిరణ్మయి (22), నల్గొండ జిల్లా పి.ఎ.పల్లి కి చెందిన శిరీష (20), కొండమల్లేపల్లి అన్నేపక అరవింద్ (23)గా గుర్తించారు. స్నేహితుడి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News