Thursday, January 23, 2025

వికారాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three Members dead in Car collided to Lorry

పూడూరు: వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  సోమన్ గుర్తి స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో లారిని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు జావేద్(12), ఉమర్(6) జహిరాబీ (68)గా గుర్తించారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముందున్న వాహనాలు కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News