Monday, December 23, 2024

స్తంభాన్ని ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

RTC Bus Driver died in road accident in Gadwal

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి సమీపంలోని హుకుంపేట వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాజమండ్రిలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆరుగురు స్నేహితులు తన ప్రెండ్  జన్మదిన వేడుకలలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. మృతులు ధవలేశ్వరం చెందిన వారిగా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News