హైదరాబాద్: చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. సాహెల్ హోటల్ ముందు రోడ్డు పనుల మరమ్మతుల వద్ద తొలగించిన ప్రమాద హెచ్చరిక బోర్డును పెట్టేందుకు యత్నిస్తున్న హోటల్ కార్మికుడిని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా దుర్మరణం చెందారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని అక్బర్ బాగ్ కార్పొరేటర్ మినాజుద్దీన్ చాదర్ ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నల్గొండ క్రాస్ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మలక్ పేట రైల్వే బ్రిడ్జి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాలను గుర్తిచేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. సిసి ఫూటేజీ ఆధారంగా సాహెల్ హోటల్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు గుర్తించనున్నారు. రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.