Sunday, April 27, 2025

లారీ కిందపడిన బైక్: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి లారీ కింద పడిపోవడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. బైక్ పై ఇద్దరు పురుషులు ఒక మహిళతో కలిసి మేడ్చల్ నుంచి హైదరాబాద్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News