- Advertisement -
న్యూయార్క్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తానా బోర్డు సభ్యుడు భార్య, ఇద్దరు కుమార్తెలు దుర్మరణం చెందారు. తానా బోర్డు సభ్యులు కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య తన కూతుళ్లను తీసుకొచ్చేందుకు ఆమె తన కారులో కాలేజీకి వెళ్లారు. వారిని కాలేజీ నుంచి ఇంటికి తీసుకొస్తుండగా కారును వ్యాను ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు చనిపోయారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను నాగేంద్రకు అప్పగించారు. నాగేంద్ర సొంతూరు ఎపిలోని కృష్ణా జిల్లా పామర్లు మండలం కురుమద్దలి గ్రామం. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాలోని హ్యూస్టన్‌లో నాగేంద్ర కుటుంబం నివసిస్తోంది.
- Advertisement -